ఓం భీమ్ బుష్ సినిమా 2024 రివ్యూ

 ఓం భీమ్ బుష్ సినిమా రివ్యూ


 
 ఓం భీమ్ బుష్ సినిమా రివ్యూ

నటీనటులు :  శ్రీ విష్ణు,  ప్రియదర్శి,  రాహుల్ రామకృష్ణ , ప్రీతి ముకుందన్,  ఆయిషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్,  ఆదిత్య మీనన్ తాడితరులు

నిర్మతలు : వి సెల్యులాయిడ్అండ్ సునీల్ బాలస్

సమర్పణ :యువి క్రియేషన్

దర్శకత్యం ; శ్రీహర్ష కొంగంటి           

సంగీతం ; సన్నీ  ఎంఆర్

సినిమాటోగ్రఫీ : రాజ్ తోట                

 ఎడిటింగ్ ;  విజయ్ వర్దన్

కథ ;  కృష్ణ కాంత్ అలియాస్ క్రిష్  [శ్రీ విష్ణు]    విజయ్ గుమ్మడి  [ ప్రియదర్శి]  మాధవ రేలంగి [అలియాస్ రాహుల్ రామకృష్ణ]    ముగ్గురు మంచి స్నేహితులు.  సైంటిస్టులు కావాలనేది వారి కోరిక  పీహెచ్డీ  పూర్తి చేయడం  కోసం  లెగిసి యూనివర్సిటీలో చేరుతారు ఐదేళ్లు అయినా పీహెచ్డీ పూర్తి చేయడం వాళ్లకి కుదరదు కాలేజీలో వీళ్ళు చేసే అల్లరి పనులు భరించలేక ఎలా ఐనా ముగ్గురిని  బయటకు  పంపించాలని  కాలేజ్ ప్రిన్సిపాల్  రంజిత్ వినుకొండ  [అలియాస్ శ్రీకాంత్ అయ్యంగర్] డాక్టర్ రేట్లు ఇవ్వటానికి సిద్ధపడి కాలేజీ నుంచి బయటకు పంపించేస్తారు. వచ్చిన పని పూర్తవటంతో ముగ్గురు తిరిగి ఊరికి ప్రయాణం అవుతారు ఊరికి వెళ్లే దారిలో ఈ ముగ్గురు స్నేహితులు అనుకోకుండా భైరవపురం అనే ఊరికి చేరుతారు అక్కడ జరిగే కొన్ని సంఘటనలు మాంత్రిక దళం చేసే మోసాలను గమనిస్తారు  అప్పుడు వీరికి కూడా వారి లాగ తెలివిని ఉపయోగించి డబ్బులు సంపాదించాలనుకుంటారు దానికోసం ఒక పథకం వేస్తారు కొత్త టెక్నాలజీ సహాయంతో ఆ ఊరివారి సమస్యలను పరిష్కరించి డబ్బులు సంపాదించాలనుకుంటారు.

ముగ్గురు స్నేహితులు సైంటిస్టులు అవతారం ఏత్తీ  ' ఏ టు జెడ్ సర్వీసెస్ ' అనే దుకాణ్యాన్ని తెరుస్తారు టీం'' కు   బ్యాంగ్ బ్రోస్  అనే  పేరుని పెట్టుకుంటారు తక్కువ సమయంలోనే ఊరి ప్రజలను నమ్మించి వారి అభిమానాన్ని సంపాదించుకుంటారు అయితే ఈ బ్యాంగ్బ్రోస్ నిజమైన సైంటిస్టులు  కాదని డబ్బు కోసం ప్రజలను మోసం చేస్తున్నారని  విషయం  బయటపడుతుంది దీంతో ఆ ఊరి సర్పంచ్  ఆదిత్య మీనన్  ఈ ముగ్గురికి  ఒక  పరీక్ష  పెడతారు  ఊరి చివర ఉన్న సంపంగి మహల్ లోకి  వెళ్లి  నిధిని  తీసుకురావాలని  ఆదేశిస్తారు  మహల్లో ఉన్న సంపంగి దయ్యం వల్ల బ్యాంగ్ బ్రోస్ కి  ఎదురైన సంఘటనలు ఏంటి ?   సంపంగి మహల్ కథ ఏంటి ?        ఆ మహల్ లో నిజంగానే నిధి ఉందా ?  అసలు చివరికి ఏమైంది ?  అది తెలుసుకోవాలంటే ఈ సినిమాని ఒకసారి చూడండి.

ఫ్లాష్ మూవీ రివ్యూస్ టీం విశ్లేషణ  ;-    సాధారణంగా ఎటువంటి లాజిక్ లో లేకుండా కేవలం మ్యాజిక్ ని నమ్ముకొని వినోదభరితంగా ప్రేక్షకులను ఆనందింప చేయడానికి పూర్తిస్థాయిలో హారర్ మరియు వినోదాన్ని కలగలిపిన ప్రయత్నం  ఈ సినిమ.      జాతి రత్నాలు తరహాలో ముగ్గురు స్నేహితులు ప్రయాణము ' ఓం భీమ్ బుష్ ' సినిమ .    హరర్  జానార్కు కామెడీని జోడించిన  తరహా సినిమాలు  ప్రేక్షకులను అలరించినవి చాలా వరకు ఉన్నాయి .  ముగ్గురు స్నేహితులు తమ ప్రదర్శన  సినిమాకు  ప్రధాన ఆకర్షణ   వినోదబరిత సన్నివేశాలను వారి మంచి ప్రదర్శనను కనబరిచారు ముఖ్యంగా ప్రియదర్శి సంపంగి దయ్యం మధ్య సన్నివేశాలను ప్రేక్షకులను అలరిస్తాయి రాహుల్ రామకృష్ణ శ్రీ విష్ణు  వారి రోల్స్ లో  మెప్పించారు.  సంగీతం సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన  ఆకర్షణగా నిలిచాయి.    కద పరంగా సాదాసీదాగా ఉన్న క్లైమాక్స్ మరియు కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి.                                                                                                                                                                                                                                                                   ఫ్లాష్ మూవీ రివ్యూస్ వారి ఫైనల్ రివ్యూ ఏంటంటే సినిమాని ఒకసారి చూసి ఆనందించొచ్చు


Post a Comment

0 Comments